ప్రేమపక్షులు విరాట్‌కోహ్లీ, అనుష్క శర్మ సాగరతీరంలో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు కోహ్లీ. ఈ స్టిల్కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఇన్‌స్టాలో దాదాపు 40 లక్షల లైకులు వచ్చాయి. ఈ ఫొటోను చూసిన అభిమానలు "నిజమైన ప్రేమకు అర్థం వీరే" అని కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలని మరికొందరు కోరారు.
ఇటీవల వెస్టిండీస్ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చాడు టీమిండియా సారథి కోహ్లీ. సతీమణి అనుష్కతో కలిసి ముంబయి ఎయిర్‌పోర్టులో కనిపించాడు. సెప్టెంబర్ 15 నుంచి ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
భారత జట్టు...