పది సంవత్సరాల సినీ ప్రస్థానంలో తానెప్పుడూ ఉత్తమ కథలనే ఎంచుకున్నట్లు చెప్పింది బాలీవుడ్ నటి అనుష్క శర్మ. వివిధ రకాల జోనర్లలో నటించడమే కాకుండా పలు సినిమాలనూ నిర్మించినట్లు తెలిపింది.
ఆమె నిర్మాణంలో రూపొందిన 'ఎన్హెచ్ 10' సినిమా విడుదలై నేటితో 5 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను పంచుకుందీ నటి.
" 'ఎన్హెచ్ 10' చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచన నాదే. ప్రజలను అలరించటానికి ఇదీ ఒక మార్గమే. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని సినిమాతో అందిచాలన్నదే నా లక్ష్యం. నటిగా నా కెరీర్ మొత్తంలో విలక్షణమైన కథలకే మద్దతిచ్చాను. 'ఎన్హెచ్ 10' చిత్రం నా వద్దకు వచ్చినప్పుడు, నిర్మాతగా ప్రేక్షకులకు అందిచాలన్నది నాకు అనిపించింది".