బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విట్టర్ ఖాతాను తొలగించాడు. "భయంలేకుండా మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు అసలు మాట్లాడకుండా ఉండటమే మంచిది" అని చివరిగా సందేశం పోస్ట్ చేశాడు. ఇటీవల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేయడం సంచలనమైంది. మరోసారి ఇదే అంశాన్ని తెరపైకి తెస్తూ సోషల్ మీడియా ఖాతా నుంచి వైదొలిగాడు.
" తల్లిదండ్రులకు బెదిరింపులు, కూతురికి అంతర్జాలం వేదికగా ఇబ్బందులు వస్తుంటే ఎవరూ మాట్లాడాలని అనుకోరు. ఇదంతా ఏ కారణంతో ఎవరు చేస్తున్నారో తెలియదు. కొందరు దుండగులు ఇలాంటి పద్ధతిని ఎంచుకొని రాజ్యమేలుతున్నారు. ఈ నవభారతంలో ఉన్న అందరికి అభినందనలు. ప్రతి ఒక్కరికి సంతోషం, విజయం చేకూరాలని కోరుకుంటున్నా. ఇదే నా చివరి ట్వీట్ ఎందుకంటే నేను ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నాను. ఎటువంటి భయం లేకుండా నా భావాలు వ్యక్తపరిచే స్వేచ్ఛలేనపుడు... మాట్లాడినా ఉపయోగం లేదు. గుడ్‌బై "
-- అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ దర్శకుడు