బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వివాహాలకు సంబంధించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వెల్తువెత్తుతున్నాయి. అనురాగ్ గతంలో ఆర్తి బజాజ్, కల్కి కొచ్లిన్లను పెళ్లి చేసుకోగా.. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే "ఒక్క భార్యను హ్యాండిల్ చేయలేకపోయిన మీరు.. జ్ఞానాన్ని ప్రసాదిస్తానని వస్తున్నారా" అంటూ నెట్టింట్లో కామెంట్లు వినిపించాయి. వీటిపై అనురాగ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
"స్త్రీలను హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. వారే మిమ్మల్ని, మీ కుటుంబ బాధ్యతను మోస్తారు. ఇరువురికి సరిపోనప్పుడు తనకు వదిలేసి వెళ్లే స్వేచ్ఛ ఉంది. తనను కట్ట్టి పడేయడానికి బానిస కాదు."