బాలీవుడ్ నటి తాప్సీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇళ్లు, కార్యాలయాల్లో మూడో రోజు కూడా ఐటీ సోదాలు సాగుతున్నాయి. ఇప్పటికే చేసిన దాడుల్లో వీరి దగ్గర లెక్కల్లోలేని దాదాపు రూ.650 కోట్ల మేర ఆర్థిక అవకతవకలను గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గుర్తించింది.
తాప్సీ, అనురాగ్ నివాసాల్లో మూడోరోజూ సోదాలు - తాప్సీ ఐటీ రైడ్స్
సెలబ్రిటీలు తాప్సీ, అనురాగ్ కశ్యప్‌పై ఐటీ దాడులు మూడో రోజు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.650 కోట్ల మేర ఆర్థిక అవకతవకల్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
మధు మంతెన, వికాస్ భల్, అనురాగ్ కశ్యప్‌కు చెందిన రెండు నిర్మాణ సంస్థలు తమ తీసిన చిత్రాల బాక్సాఫీస్ వసూళ్లతో పోలిస్తే ఆదాయాన్ని తక్కువ చేసి చూపించాయని సీబీడీటీ పేర్కొంది. రూ.300 కోట్ల మేర ఉన్న వత్యాసం గురించి సంస్థ ప్రతినిధులు చెప్పలేకపోయారని తెలిపింది.
అలానే భాగస్వామ్యుల మధ్య వాటా లావాదేవీల సంబంధించి రూ.350 కోట్ల మేర పన్ను అక్రమాలను గుర్తించినట్లు సీబీడీటీ వెల్లడించింది. తాప్సీ నుంచి రూ.5 కోట్ల నగదు రసీదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రెండు సెలబ్రిటీ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆఫీస్‌ల నుంచి ఈమెయిల్, వాట్సాప్ చాటింగ్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది.