సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్లో బంధుప్రీతిపై అగ్గి రాజేసుకుంది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రముఖ సినీ తారల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెపోటిజమ్‌తో పాటు, ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్ గురించి వరుస ట్వీట్లతో మరో చర్చకు తెర లేపారు.
నెపోటిజమ్ గురించి మాట్లాడుతున్న స్టార్లంతా.. తమ సహ నటులు, సెట్లో ఉండే స్పాట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ను కనీసం పట్టించుకోరని పేర్కొన్నారు.
"ఫ్రెండ్స్.. ప్రస్తుతం ఓ వింత చర్చ నడుస్తోంది. అయితే సినిమాల్లో నటులు మాత్రమే లేరు. కనీసం 150 మందికిపైగా సెట్స్‌లో పని చేస్తారు. ఇన్సైడ్, అవుట్ సైడర్స్ ఎవరైనా కావచ్చు. తోటి కళాకారులు, కార్మికులు, స్పాట్ బాయ్‌లకు ఒకే గౌరవం ఇవ్వడం నేర్చుకున్న రోజు.. వారితో కలిసి మాట్లాడొచ్చు. మొదట ఏ నటుడు, దర్శకుడు వారితో అనుచితంగా ప్రవర్తించారో.. ఎవరు చిత్రీకరణ పని పూర్తిగా నిలిచిపోయేలా చేస్తున్నారో సెట్స్‌లో పని చేసే వారిని అడగండి. ఆ తర్వాత నటీనటులు సెట్స్‌పైకి వెళ్లండి. అంతే కాకుండా సహయ నటుల పాత ఇంటర్వ్యూలు చూడండి. వారు ఎందుకు ఫలానా సినిమా ఆఫర్‌ను వదిలేసుకోవాల్సి వచ్చిందో వినండి. మీరు ఏ విధంగా ఇతరులతో ప్రవర్తిస్తారో.. అదే విధంగా ఇతరులు మీతో ప్రవర్తిస్తారు."