తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మొక్కలు నాటుతూ అనుపమ.. పార పట్టిన సల్మాన్​ - సమంత ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్

సినిమా ప్రారంభోత్సవాలు.. వివాహ వార్షికోత్సవాలు.. పోస్టర్లు.. ట్రైలర్లు.. ఇలా సోషల్‌ మీడియాలో సినీ తారలు గురువారం సందడి చేశారు. కానీ, హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్​​, బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ మాత్రం మా రూటే సెపరేటు అంటూ శ్రమబాట పట్టారు. ఒకరు మొక్కలు నాటగా.. మరొకరు వ్యవసాయం చేస్తున్న ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత చేరువగా ఉంటున్నారు. మరి ఈరోజు ఇంకా ఎవరెవరు ఏయే పోస్టులు చేశారో చూసేద్దామా..!

Anupama takes up the green india challenge.. Salman Khan hits the field to plough the land
శ్రమదానంలో పాల్గొన్న అనుపమ, సల్మాన్​

By

Published : Dec 10, 2020, 10:01 PM IST

> 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్​'లో భాగంగా ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మొక్కలు నాటారు. హీరో నిఖిల్​ నామినేట్​ చేసిన క్రమంలో గురువారం ఆమె బాచుపల్లిలో మూడు మొక్కలను నాటారు.

> బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. 'భూమి తల్లి' అంటూ తాను పొలంలో పనులు చేస్తున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

> గురువారం 'కేజీఎఫ్‌' హీరో యశ్‌ పెళ్లిరోజు. ఈ సందర్భంగా అతని భార్య రాధికాపండిట్‌ వాళ్లిద్దరి ఫొటోను పంచుకుంది.

> సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 14మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో ప్రకటించింది.

> సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'కపటధారి'. శుక్రవారం (డిసెంబరు 11) సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి తొలి లిరికల్​ వీడియోను చిత్రబృందం విడుదల చేయనుంది.

మొక్కలు నాటుతున్న అనుపమ పరమేశ్వరన్​
మొక్క నాటి సెల్ఫీ తీసుకుంటున్న హీరోయిన్​ అనుపమ
భూమిని చదును చేస్తున్న సల్మాన్​ ఖాన్
హీరో యశ్​ దంపతులు
సమంత
'కపటధారి' ఫస్ట్​ లిరికల్ వీడియో విడుదల పోస్టర్​

ABOUT THE AUTHOR

...view details