విభిన్న పాత్రలతో కుర్రకారుల హృదయాల్ని దోచుకుంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ లఘు చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ షార్ట్‌ఫిల్మ్‌కు 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఇందులోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్'లో అనుపమ లుక్ అదుర్స్ - అనుపమ పరమేశ్వరన్
అరంగేట్రం చేసిన తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు పొందింది స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' లఘుచిత్రంలో నటిస్తోంది. ఆదివారం ఈ షార్ట్‌ఫిల్మ్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది.
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్'లో అనుపమ లుక్ అదుర్స్
ఈ ఫస్ట్‌లుక్‌లో చీరకట్టుతో, కాటుక కళ్లతో అనుపమ కనువిందు చేస్తోంది. ఆర్జే షాన్ ఈ లఘుచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అఖిల్ మిధున్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చూడండి:'సాని కాయిదం'లో డీగ్లామర్‌గా కనిపించిన కీర్తి సురేశ్