Anupama Parameswaran Pregnant Photos: మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌కు సామాజిక మాధ్యమాల్లో ఉండే క్రేజే వేరు. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలు, రీల్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుందీ భామ. ఈ క్రమంలోనే సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఓ ఫొటో అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. అదే గర్భవతిగా ఉన్న ఫొటో.
దీంతో అనుపమ ప్రెగ్నెంట్ కావడమేంటని ఆశ్చర్యపోతున్నారు ఫాలోవర్స్. అయితే ఆమె నిజంగా గర్భవతి కాలేదు. అది 2019లో వచ్చిన 'మణియారయిలే అశోకన్' అనే మలయాళ సినిమా షూటింగ్లో తీసుకున్నది. ఫొటోలో అనుపమతో పాటు ఆమె తండ్రి కూడా ఉన్నారు.
ఈ ఫొటోకు పలువురు సరదాగా కంగ్రాట్స్ అని కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు డైహార్డ్ ఫ్యాన్స్ అయితే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే 'రౌడీబాయ్స్' సినిమాలో ముద్దు సీన్ చూసే హర్ట్ అయ్యాం, మళ్లీ ఇలాంటివి పెట్టకండి అంటున్నారు.