తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అనుపమ పెళ్లి క్రికెటర్ బుమ్రాతో ఫిక్స్!​ - అనుపమ న్యూస్

చివరి టెస్టు నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకోవడం, అనుపమ గుజరాత్​ వెళ్లడం లాంటి విషయాలు కొద్దిరోజుల వ్యవధిలో జరగడం వల్ల నెటిజన్లు ఓ అభిప్రాయానికి వచ్చేశారు. వీరిద్దరి పెళ్లి జరగనుందని ఫిక్సయిపోయారు.

anupama parameswaran marriage with bumrah
అనుపమ పెళ్లి క్రికెటర్ బుమ్రాతోనే.. ఇది ఫిక్స్!​

By

Published : Mar 4, 2021, 2:14 PM IST

Updated : Mar 4, 2021, 2:26 PM IST

క్రికెటర్ బుమ్రా పెళ్లి హీరోయిన్​ అనుపమతో జరగనుందనే వార్త మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం దీని గురించే సోషల్ మీడియాలో తెగ మాట్లాడేసుకుంటున్నారు.

అసలు ఏమైంది?

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టుకు బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరమై సొంతూరుకు వెళ్లాడు. దీంతో అతడి పెళ్లి త్వరలో జరగనుందనే వార్తలు తెగ వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో హాలీడే ట్రిప్​ కోసం గుజరాత్ వెళ్తున్నానని హీరోయిన్ అనుపమ ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్ పెట్టింది.

అనుపమ ఇన్​స్టా స్టోరీ

దీంతో బుమ్రాను ఈమె వివాహం చేసుకుంటుందా? లేదా అక్కడికి వెళ్లేందుకు మరేదైనా కారణం ఉందా? అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. కొన్నాళ్లు ఆగితే తప్ప దీని గురించి క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.

క్రికెటర్ బుమ్రా

ఇది చదవండి:'18 పేజీస్​'లోకి 18వ రోజు వచ్చిన అనుపమ!

Last Updated : Mar 4, 2021, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details