'అర్జున్ సురవరం'తో ఇటీవలే విజయాన్ని అందుకున్నాడు హీరో నిఖిల్. అనేక అవాంతరాలు ఎదురైనా ఈ చిత్రం.. ఎట్టకేలకు విడుదలై, ప్రేక్షకుల మెప్పించింది. ఈ ఆనందంలో కొత్త సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాడీ కథానాయకుడు. 'కార్తికేయ' సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. రెండో భాగంలో అనుపమ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండబోతుందట. అందుకే ఈ సీక్వెల్‌లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.