హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. తన పొరపాటు ఇప్పుడే గుర్తించానని ట్విట్టర్లో పేర్కొంది.
పవన్ అభిమానులకు సారీ చెప్పిన అనుపమ
అనుపమ చేసిన ఓ ట్వీట్‌పై పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారికి క్షమాపణలు చెప్పిందీ ముద్దుగుమ్మ. ఇంతకీ ఏం జరిగింది?
పవన్ కల్యాణ్ అనుపమ
ఇటీవల ఓటీటీలో 'వకీల్‌సాబ్' విడుదలైంది. సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేసిన అనుపమ.. అందులో పవన్ కల్యాణ్ అని మాత్రమే రాసింది. మరోవైపు ప్రకాశ్‌రాజ్ సర్ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమెపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోకు గౌరవం ఇవ్వలేదని కామెంట్లు పెట్టారు. దీంతో వారికి క్షమాపణలు చెబుతూ అనుపమ మరో ట్వీట్ చేసింది.
ప్రస్తుతం ఈమె తెలుగులో '18 పేజీస్', 'రౌడీ బాయ్స్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.