ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా గుర్తింపు తెచ్చుకుంది. అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసింది. గతేడాది వచ్చిన 'రాక్షసుడు' చిత్రంలో టీచర్‌గా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో మూడోసారి కలిసిపనిచేసేందుకు సిద్ధమవుతుందని సమాచారం.
హీరోయిన్ అనుపమతో నిర్మాత దిల్‌రాజు మూడోసారి! - entertainment news
నిర్మాత దిల్‌రాజు మేనల్లుడు ఆశిష్‌రెడ్డి హీరోగా పరిచయమవుతున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. చాలా రోజుల విరామం తర్వాత మరో తెలుగు చిత్రంలో కనిపించనుందీ భామ.
![హీరోయిన్ అనుపమతో నిర్మాత దిల్‌రాజు మూడోసారి! హీరోయిన్ అనుపమ నిర్మాత దిల్‌రాజుతో మూడోసారి!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6335795-14-6335795-1583640155545.jpg)
అనుపమ పరమేశ్వరన్
గతంలో దిల్‌రాజు నిర్మాణంలో వచ్చిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమకోసమే'లో హీరోయిన్గా నటించింది అనుపమ. ఇప్పుడు ఈయన మేనల్లుడు ఆశిష్‌రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోందీ సినిమా. 'హుషారు' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.