'ప్రేమమ్'తో కుర్రకారు మదిదోచిన ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. తర్వాత పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. చిన్నవయసులోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆర్థిక విషయాల్లో తన ఆలోచనలెలా ఉంటాయో తెలిపింది.
'హైదరాబాద్‌లో ఉంటే వెయ్యి రూపాయలు చాలు' - అనుపమా పరమేశ్వరన్ వార్తలు
'ప్రేమమ్' చిత్రంతో అలరించిన ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ ఆర్థిక విషయాల్లో తన ఆలోచనలేంటో తెలిపింది.

"చిన్నప్పటి నుంచి నేనూ ఓ సగటు మధ్యతరగతి అమ్మాయిలాగే పెరిగా. అందుకే ఆర్థికపరమైన విషయాల్లో నాకు మంచి అవగాహనే ఉంది. కానీ, అదే పనిగా వాటి గురించి లెక్కలేసుకోను. నాకు ఎంత పారితోషికం వస్తుందో తెలుసు. కానీ, ఆ తర్వాత విషయాలన్నీ మా అమ్మానాన్నలే చూసుకుంటారు. వ్యక్తిగతంగా బతకాలంటే అంత డబ్బేమి అవసరం లేదనేది నా అభిప్రాయం. అయినా నాకు డబ్బుతో పనేం ఉంటుంది? షాపింగ్ పిచ్చి అసలు లేదు. ఎప్పుడో కానీ బయటకి వెళ్లను. హైదరాబాద్‌లో ఉంటే చేతిలో వెయ్యి రూపాయలు ఉంటే చాలేమో అనిపిస్తుందంతే. సినిమా, నటన.. ఈ రెండు తప్ప నాకు మరో పిచ్చి లేదు. మనం వాడు కోవడానికి ఒక కారు, ఉండటానికి మంచి ఇల్లు చాలు" అంటూ వెల్లడించింది.