తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వండర్​ఫుల్​గా 'బటర్​ఫ్లై' ట్రైలర్​.. ఒకే రోజు రెండు సినిమాలతో దీపిక - పఠాన్ రిలీజ్​ తేదీ

Anupama Butterfly: కొత్త సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్​ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ చిత్రం 'బటర్​ఫ్లై' , దీపికా పదుకొణె నటించిన 'పఠాన్'​, 'ఫైటర్​' సినిమాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

anupama
deepika padukone

By

Published : Mar 4, 2022, 7:49 AM IST

Anupama Butterfly: అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న థ్రిల్లర్‌ చిత్రం 'బటర్‌ఫ్లై'. గంటా సతీష్‌బాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రవి ప్రకాష్‌ బోడపాటి, ప్రసాద్‌ తిరువళ్లూరి, ప్రదీప్‌ నల్లిమెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.

అనుపమ సంతోషంగా తన అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లడం.. లిఫ్ట్‌ ఎక్కే క్రమంలో కొన్ని అనూహ్య దృశ్యాలు ఆమె కంటపడటం.. అక్కడి నుంచి ఆమె జీవితం సమస్యల్లో చిక్కుకోవడం.. లాంటి సన్నివేశాలతో టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మరి ఆమెకు కనిపించిన ఆ అనూహ్య దృశ్యాలేంటి? ఆమెను వెంటాడుతున్న వ్యక్తులెవరు? బటర్‌ఫ్లై అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ఇటు యువతరంతో పాటు అటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.

ఒకే రోజు రెండు సినిమాలతో దీపిక..

ఒకేసారి ఓ హీరోయిన్‌, హీరో, దర్శకుడికి సంబంధించిన రెండు సినిమాలు విడుదల కావడం అరుదు. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణె, కథానాయకుడు జాన్‌ అబ్రహం, ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ విషయంలో అదే జరగనుంది. షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'పఠాన్‌'. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకొణె కథానాయిక. జాన్‌ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బుధవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌. 'పఠాన్‌'ను రిపబ్లిక్‌ డే కానుకగా వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. "ఇప్పటికే ఆలస్యం అయిందని తెలుసు. 'పఠాన్‌' విడుదల తేదీని గుర్తుపెట్టుకోండి. జనవరి 25, 2023న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మీముందుకు వస్తున్నాం"అని ట్విటర్‌లో రాశారు షారుక్‌ఖాన్‌.

దీపికా పదుకొణె

ఇక ఇప్పటికే హృతిక్‌ రోషన్‌ తన 'ఫైటర్‌' విడుదల తేదీని ప్రకటించారు. 'ఫైటర్‌'ను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికీ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనందే. ఇందులోనూ కథానాయిక దీపికా పదుకొణేనే కావడం విశేషం. ఈ సినిమా భారీ స్థాయి యాక్షన్‌ హంగామాతో హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతోంది. దీంతో 'పఠాన్‌', 'ఫైటర్‌' మధ్య బాక్సాఫీసు యాక్షన్‌ పోరు ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇదీ చదవండి: ప్రభాస్​ను అలా చూసి ఆశ్చర్యపోయా: నటి భాగ్యశ్రీ

ABOUT THE AUTHOR

...view details