సాధారణంగా గోవాలో ఎంజాయ్ చేయటానికి అబ్బాయిలు గ్యాంగ్‌తో వెళతారు. ఇందులో మాత్రం నలుగురు అమ్మాయిలు వెళ్లారు. అందులోను అందమైన భామలు. ఇక వారి వినోదానికి అంతే లేకుండా పోయింది. ఇంతలో వారికి కావలిసిన ఒకతను హత్యకు గురవుతాడు. వారి పరిస్థితి 'అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి' అన్నట్లుగా మారింది. మరి ఈ హత్య చేసింది ఎవరు? ఈ క్రైమ్ నుంచి వారు బయట పడ్డారా? లేదా? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.
ఆ హత్యకు.. ఈ అమ్మాయిలకు సంబంధం ఏంటి? - Dhanya Balakrishna
'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' సినిమా ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. ప్రధాన పాత్రల్లో నటించిన నలుగురు భామలు తమ అంద చందాలతో చిత్రంపై అంచనాలను పెంచుతున్నారు.
![ఆ హత్యకు.. ఈ అమ్మాయిలకు సంబంధం ఏంటి? Anukunnadhi Okkati Ayyindhi Okkati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5320340-1033-5320340-1575898629231.jpg)
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ట్రైలర్
క్రైమ్ అడల్ట్ కామెడీ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్‌ను హీరో నితిన్ సోమవారం విడుదల చేశాడు. ఇందులో ధన్య బాలకృష్ణన్, సిద్ధి ఇదానీ, కోమలి, త్రిదా చౌదరి హీరోయిన్లుగా నటించారు. భల్లు దర్శకత్వం వహించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: అమ్మాయి కోసం సిగరెట్ మానేసిన ఎస్పీ బాలు