హీరో రాజశేఖర్(Raja Shekar) ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'శేఖర్'. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్.ఎల్.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. ఇందులో ఇద్దరు కథానాయికలు సందడి చేయనున్నారు.
మలయాళం కథానాయిక అను సితార(Anu Sithara), హిందీ తార ముస్కాన్ ఖుబ్‌చందానీ(Muskaan Khubchandani)ని చిత్రబృందం ఎంపిక చేసింది. అను సితారకు ఇదే తొలి తెలుగు చిత్రం. ముస్కాన్ 'జార్జ్‌రెడ్డి'(George Reddy) సినిమాతో టాలీవుడ్లో సందడి చేసింది.