'మహా సముద్రం'లో కీలకపాత్ర కోసం అను ఇమాన్యుయెల్ - Maha samudram news
టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'మహా సముద్రం'. ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే అదితీరావు హైదరీ అని ప్రకటించగా.. ఇందులోని మరో కీలకపాత్ర కోసం అను ఇమాన్యూయెల్ను చిత్రబృందం ఎంపిక చేసింది.
'మహాసముద్రం'లో కీలకపాత్ర కోసం అను ఇమాన్యుయెల్
'ఆర్ఎక్స్ 100' వంటి హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం 'మహాసముద్రం'. శర్వానంద్ హీరోగా, సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా అదితీరావు హైదరీ అని ప్రకటించగా.. రెండో కీలకపాత్ర కోసం అను ఇమాన్యుయెల్‌ను చిత్రబృందం ఎంపికచేసింది. సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గాఢతతో నిండిన చక్కటి ప్రేమకథతో రూపొందనున్న చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది.