సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ భర్త ఆయుష్ శర్మ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'. ఇందులో సల్మాన్‌ఖాన్ ఓ కీలకపాత్రలో కనువిందు చేయనున్నారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకుడు. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోందీ చిత్రం. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన సల్మాన్ ఫస్ట్‌లుక్ వీడియో విడుదల చేసింది చిత్రబృందం.
బాహాబాహీ తలపడుతున్న బావ-బావమరిది! - సల్మాన్‌ఖాన్ ఆయుష్ శర్మ ఫస్ట్‌లుక్
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్, అతని బావమరిది ఆయుష్ శర్మలు కలిసి బాహాబాహీ తలపడుతున్నారు. అయితే ఇది నిజజీవితంలో కాదు. ఓ సినిమా కోసం మాత్రమే. 'అంతిమ్' సినిమా కోసం పోరాట సన్నివేశాల చిత్రీకరణలో వీరిద్దరు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.
బాహాబాహీ తలపడుతున్న బావ-బావమరిది!
'అంతిమ్' సెట్లో సల్మాన్, ఆయూష్ మధ్య పోరాటం జరుగుతున్నట్లుగా ఉన్న వీడియోను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ఇద్దరూ పోటాపోటీగా తలపడుతున్నట్లు ఉన్న ఫస్ట్‌లుక్ వీడియో ఆకట్టుకుంటోంది. "కష్టపడేతత్వం మీ నుంచి చెమటను, రక్తాన్ని కోరుతుంది. అందుకు బదులుగా మీకు చాలా ఇస్తుంది. 'అంతిమ్' ప్రయాణం మొదలైంది" అంటూ కథానాయకుడు ఆయుష్ పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి:మొదట్లో చాలా భయపడ్డా.. కానీ ఆ తర్వాత!