తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పైరసీ నియంత్రణకు ఆహా యాంటీ పైరసీ సెల్‌ కృషి - తెలంగాణ వార్తలు

సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక సినిమా పైరసీ ఎక్కువయిందని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలను పైరసీ చేసి ప్రదర్శించే ఎంఎస్​ఓలు, కేబుల్ ఆపరేటర్లపై కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సినిమా పైరసీ నియంత్రణకు కృషి చేస్తోన్న యాంటీ పైరసీ సెల్‌
సినిమా పైరసీ నియంత్రణకు కృషి చేస్తోన్న యాంటీ పైరసీ సెల్‌

By

Published : Feb 2, 2021, 6:46 PM IST

సినిమాలను పైరసీ చేసి ప్రదర్శించే ఎంఎస్​ఓలు, కేబుల్ ఆపరేటర్లపై కఠినచర్యలు తప్పవని... దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హెచ్చరించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక సినిమా పైరసీ ఎక్కువయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీ నియంత్రణకు ఆహా ఓటీటీ సంస్థ ముందుకురావడం అభినందనీయమన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌లో యాంటీ పైరసీ సెల్‌కు తోడుగా అర్హ మీడియా బ్రాడ్ కాస్టింగ్ సంస్థ.. పైరసీని నియంత్రించేందుకు కృషి చేయడం నిర్మాతలకు ఊరట కలిగిస్తుందన్నారు.

ఈ నెల 5న ఆహాలో క్రాక్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో... ఆ సినిమా పైరసీ బారినపడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని.. అర్హ మీడియా యాంటీ పైరసీ సెల్‌ వ్యవస్థాపకుడు చలపతి వివరించారు.

సినిమా పైరసీ నియంత్రణకు కృషి చేస్తోన్న యాంటీ పైరసీ సెల్‌

ఇదీ చదవండి:'అన్నిజిల్లాలో టూరిజం.. ప్రతి రిజర్వాయర్​ దగ్గర బోటింగ్'

ABOUT THE AUTHOR

...view details