తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాయంత్రం ఏఎన్​ఆర్​ జాతీయ పురస్కార వేడుక - telugu cinema awards

ఏటా ఇచ్చే అక్కినేని జాతీయ అవార్డులు.. అలనాటి తార శ్రీదేవి(2018), రేఖ(2019)లను వరించాయి. ఈ సాయంత్రం 5 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్​ వేదికగా కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఏఎన్​ఆర్​ జాతీయ పురస్కార వేడుక నేడే

By

Published : Nov 17, 2019, 1:17 PM IST

ప్రతిష్టాత్మక ఏఎన్​ఆర్​ జాతీయ అవార్డు వేడుక ఈరోజు హైదరాబాద్​లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. అలనాటి అందాల తారలు శ్రీదేవి, రేఖ.. ఏటా ఏఎన్​ఆర్ ఫౌండేషన్ ఇచ్చే ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. 2018కి గానూ శ్రీదేవి, 2019కి గానూ రేఖ ఈ అవార్డులు సొంతం చేసుకున్నారు.

శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీకపూర్​ అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. అవార్డుతో పాటు 5 ల‌క్షల న‌గ‌దు బ‌హుబ‌తి అందివ్వనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్​ వేదికగా దిగ్గజ నటుడు చిరంజీవి చేతుల మీదుగా ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది.

అక్కినేని నాగేశ్వరరావుతో శ్రీ‌దేవి, రేఖ‌ల‌కు మంచి అనుబంధం ఉంది. ఏఎన్​ఆర్ - శ్రీ‌దేవి కాంబినేష‌న్‌లో 'ప్రేమాభిషేకం', 'శ్రీ‌వారి ముచ్చట్లు' లాంటి సూప‌ర్ హిట్ చిత్రాలొచ్చాయి.

గ‌తంలో అమితాబ్‌ బచ్చన్‌, బాల‌చంద‌ర్‌, దేవానంద్‌, రాజ‌మౌళి, ల‌తా మంగేష్కర్ వంటి సినీ ప్రముఖులు ఏఎన్​ఆర్ అవార్డులు అందుకున్నారు.

ఇవీ చూడండి.. 'మహిళలు బలంగా ఉండరని ఎవరన్నారు..

ABOUT THE AUTHOR

...view details