అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. 2018కి గానూ దివంగత నటి శ్రీదేవికి, 2019కి గానూ ఈ అవార్డు నటి రేఖకు అందిస్తున్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను ఇవ్వనున్నారు.
ఈ అవార్డు వేడుకలో మాట్లాడిన అగ్ర కథానాయకుడు నాగార్జున..."నాన్న అక్కినేని నాగేశ్వరరావు కోరిక మేరకు అలనాటి తారలు శ్రీదేవి, రేఖకు ఏఎన్నార్ అవార్డులు ఇస్తున్నాం" అని చెప్పాడు.
నాన్న ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం: నాగ్ " సినిమా నాకు సర్వస్వం. అదే నాకు ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఓ అవార్డు సృష్టించబడింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చేవారిని... ఏఎన్నార్ జాతీయ అవార్డుతో సత్కరించాలన్న నాన్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆయన సంకల్పమే ఇవాళ మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలనే మేం ఆచరిస్తున్నాం"
-- నాగార్జున, సినీ నటుడు
ఈ అవార్డులతో ఏఎన్నార్ సంకల్పం నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు నాగ్.
" చిత్ర పరిశ్రమలోని గొప్ప వ్యక్తులను సత్కరించి, వారి పేరుతోపాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ అవార్డు ఇస్తున్నాం. శ్రీదేవి, రేఖకు ఆ గౌరవం దక్కాలని, వారికి ఏఎన్నార్ జాతీయ అవార్డు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. ఆయన ఉన్నప్పుడు వీరికి ఇవ్వలేకపోయాం. కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావు ఉంటారు. ఈ వేదికపై ఉన్న ఏఎన్నార్ జాతీయ అవార్డుతోపాటు నాన్న ఇక్కడ మనతోనే, మనలోనే ఉన్నారని అనుకుంటున్నా".
-- నాగార్జున, సినీ నటుడు
ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా చిరంజీవి, సుబ్బరామి రెడ్డి, బోనీ కపూర్ తదితరులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో నాగచైతన్య, అఖిల్, అక్కినేని అమల, విజయ్‌దేవర కొండ, మంచులక్ష్మి, నిహారికి, అడవి శేష్, రాహుల్ రవీంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
నాన్న ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం: నాగ్ ఇదీ చూడండి:రాక్షసితో పని చేస్తుంటే బాగుందన్నరమ్యకృష్ణ