అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పుష్ప'. శేషాచలం అడవుల నేపథ్య కథతో రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులోని కీలక పాత్ర కోసం ఓ యువ కథానాయకుడిని సంప్రదించారట. వ్యతిరేక ఛాయలతో కూడిన ఆ పాత్రలో కనిపించే ఆ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
'పుష్ప'లో అల్లు అర్జున్‌తో పాటు మరో హీరో? - అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మరో హీరో
బన్నీ 'పుష్ప'లో కీలక పాత్ర కోసం ఓ యువహీరోను చిత్రబృందం సంప్రదించిందని సమాచారం.

అల్లు అర్జున్
మరో కీలక పాత్రకు ఇంకో టాలీవుడ్ కథానాయకుడిని పరిశీలించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.