డార్లింగ్ ప్రభాస్‌కు అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ చెబుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది 'రాధేశ్యామ్' టీమ్. ఇందులో విక్రమ్ ఆదిత్యగా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ క్రమంలోనే కారుపై స్టైల్‌గా కూర్చొని ఉన్న ఆయన ఫొటోను బుధవారం విడుదల చేసింది. ఈనెల 23న టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
'రాధేశ్యామ్' నుంచి సర్ప్రైజ్.. ప్రభాస్ కొత్త లుక్ - prabhas latest news
'రాధేశ్యామ్'లో విక్రమ్ ఆదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఈ మేరకు కొత్త లుక్‌ను విడుదల చేశారు.
'రాధేశ్యామ్' నుంచి ప్రభాస్ కొత్త లుక్
ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.