తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బీమ్​ ఫర్ రామరాజు- ఆర్​ఆర్​ఆర్​ నుంచి మరో సర్​ప్రైజ్​ - రామ్​చరణ్

రామ్​చరణ్​ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను నేడు విడుదల చేయనుంది ఆర్​ఆర్​ఆర్ చిత్రబృందం. 'బీమ్​ ఫర్ రామరాజు' అనే పేరుతో ఈ సర్​ప్రైజ్​ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

rrr
ఆర్​ఆర్​ఆర్

By

Published : Mar 27, 2020, 5:54 AM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్​’(రౌద్రం రణం రుధిరం). ఉగాది సందర్భంగా టైటిల్‌ లోగోతో పాటు, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసి, అభిమానుల్లో ఆసక్తి పెంచింది చిత్ర బృందం. శుక్రవారం రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ను ఇవ్వబోతోంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.

"బ్రదర్‌ రామ్‌చరణ్‌. నీ పుట్టినరోజును ఘనంగా చేయాలని కోరుకున్నా. ప్రస్తుతం మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. ఇప్పుడు ఇంట్లో ఉండటమే ముఖ్యం. అందుకే, రేపు 10 గంటలకు నీకు డిజిటల్‌ వేదికగా సర్‌ప్రైజ్‌ ఇస్తా. నన్ను నమ్ము ఇలాంటి సర్‌ప్రైజ్‌ను ఎప్పటికీ మర్చిపోలేవు"

- ఎన్టీఆర్​

ఎన్టీఆర్ ట్వీట్​కు రామ్​ చరణ్​ స్పందించి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

"వావ్‌.. సరైన సమయంలో నేను ట్విటర్‌లో చేరాను. లేకపోతే నువ్వు ఇచ్చే అద్భుతమైన సర్‌ప్రైజ్‌ను మిస్‌ అయ్యేవాడిని బ్రదర్‌. రేపటి వరకూ ఆగలేకపోతున్నా."

- రామ్​ చరణ్​

'బీమ్‌ ఫర్‌ రామరాజు' పేరుతో సర్‌ప్రైజ్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తెలుగు వీడియోను డీవీవీమూవీస్‌, తమిళ్‌ను జూ.ఎన్టీఆర్‌, హిందీ అజయ్‌దేవగణ్‌, కన్నడ వారాహి, మలయాళం రామ్‌చరణ్‌ల సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకోనున్నారు.

తొలిసారి ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కుమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details