తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సర్కారు వారి పాట' కోసం మళ్లీ దుబాయ్​కు - సర్కారు వారి పాట న్యూస్

షూటింగ్​ కోసం మళ్లీ దుబాయ్​ వెళ్లేందుకు సిద్ధమవుతోంది 'సర్కారు వారి పాట' టీమ్. మహేశ్​బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

sarkaru vaari paata in DUBAI
'సర్కారు వారి పాట' కోసం మళ్లీ దుబాయ్​కు

By

Published : Mar 3, 2021, 6:26 AM IST

మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. కీర్తిసురేశ్ హీరోయిన్. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో మొదలైంది. అక్కడ కొన్ని యాక్షన్‌ ఘట్టాలతోపాటు, పలు సన్నివేశాల్ని తెరకెక్కించారు.

ఇటీవలే తిరిగొచ్చిన ఈ చిత్రబృందం మరో షెడ్యూల్‌ కోసం ఈ నెలలోనే దుబాయ్‌ వెళ్లనున్నట్టు తెలిసింది. అనంతరం గోవాలోనూ ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ జరపనున్నట్టు సమాచారం. తమన్ సంగీతమందిస్తున్నారు.

ఇది చదవండి:నాలుగు రోజులు నిద్రలేకుండా షూటింగ్​లో పాల్గొన్న నటి!

ABOUT THE AUTHOR

...view details