సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల కుటుంబం నుంచి మరో నటుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి చిత్రం హైదరాబాద్‌లోని నానక్ రాంగూడలో లాంఛనంగా ప్రారంభమైంది. సినీటేరియా మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్న శరణ్ సినిమా ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో - సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో
సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల మనవడు శరణ్ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో
కృష్ణ, విజయనిర్మల నివాసంలో జరిగిన ఈ వేడుకలో శరణ్, జెమినీ సురేష్‌లపై చిత్రీకరించిన మూహుర్తపు సన్నివేశానికి కృష్ణ గౌరవ దర్శకత్వం వహించగా.. సుధీర్ బాబు, నవీన్ విజయకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. కథానాయకుడు సాయితేజ, సీనియర్ నటి జయసుధ అతిథులుగా హాజరై చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో రాబోతున్న శరణ్ కుమార్ సినిమాను నవంబర్ నెలాఖరులో చిత్రీకరణ ప్రారంభించి జనవరిలో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తామని నిర్మాతలు తెలిపారు.
TAGGED:
హీరోగా విజయ నిర్మల మనవడు