టోక్యో ఒలింపిక్స్ భారత్ తరఫున తొలి పతకం గెలుచుకున్న వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బయోపిక్కు రంగం సిద్ధమవుతోందట! ఈ విషయమై బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి స్టోరీలతో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లనే సాధించడం వల్ల చాను బయోపిక్కు మరింత క్రేజ్ పెరిగింది!
మీరాబాయి చాను బయోపిక్.. త్వరలో ప్రకటన!
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సొంతం చేసుకున్న వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ బయోపిక్ తెరకెక్కించేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట! ఇందులో బాలీవుడ్ స్టార్స్ ఇద్దరు నటించనున్నారని సమాచారం.
మీరాబాయిపై బయోపిక్
ఈ సినిమా హక్కుల కోసం చిత్ర నిర్మాతలు కసరత్తులు చేస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఇందులో కీలకమైన కోచ్ పాత్రలో అక్షయ్ కుమార్, చానూ పాత్రలో ప్రియాంకా చోప్రా నటించనున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి:టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం- వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం
Last Updated : Jul 26, 2021, 7:13 AM IST