తెలుగు చిత్రసీమలో 'మా' ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న అభిప్రాయభేదాలు.. ఎన్నికలు ముగిసినా సద్దుమణగడం లేదు. 'మా' ఎన్నికల తర్వాత తమ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్, నాగబాబు రాజీనామా చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో తలెత్తిన ప్రాంతీయభావం క్రమంలో ఇకపై తాము అసోసియేషన్లో సభ్యులుగా కొనసాగలేమని తేల్చి చెప్పారు.
'మా'కు పోటీగా మరో అసోసియేషన్ అంటూ ప్రచారం! - manchu vishnu panel
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా సభ్యుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయలు ఇంకా సద్దుమణగలేదు. ఇప్పటికే 'మా' సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్, నాగబాబు రాజీనామా చేయగా.. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులూ ఇదే బాట పట్టనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అందులో నిజమెంతో తెలియరాలేదు.
'మా'కు పోటీగా మరో అసోసియేషన్ అంటూ ప్రచారం!
అయితే 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున పోటీపడి గెలిచిన సభ్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. వీరంతా 'మా'ను వీడనున్నారని టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 'మా'కు పోటీగా మరో అసోసియేషన్ ఏర్పాటు చేసిన దానికి 'ఆత్మ'(ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అని పేరు పెట్టనున్నారని టాలీవుడ్లో ప్రచారం జరిగింది. అయితే అందులో నిజమెంతో తెలియరాలేదు.
ఇదీ చూడండి..అందుకే బ్యాన్ చేశారు.. 'ఆగడు' వివాదంపై ప్రకాశ్ రాజ్ స్పందన
Last Updated : Oct 12, 2021, 8:50 PM IST