తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జులైలో అనబెల్ మీ ఇంటికొస్తుంది జాగ్రత్త' - హర్రర్

కన్​జ్యూరింగ్​ యూనివర్స్ ఫ్రాంఛేజీలో ఏడో చిత్రంగా వస్తోంది అనబెల్​ కమ్స్​హోమ్​. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనబెల్ కమ్స్ హోమ్

By

Published : Mar 26, 2019, 2:52 PM IST

హాలీవుడ్ చిత్రం 'అనబెల్ కమ్స్​హోమ్'​ ఈ ఏడాది జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అనబెల్ సిరీస్ నుంచి వచ్చిన రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. హర్రర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ సినిమా భారత్​లో హిందీ, తెలుగు, తమిళం, ఆంగ్ల భాషల్లో విడుదల కానుంది.

'అనబెల్ కమ్స్ హోమ్'​ చిత్రాన్ని గ్యారీ డబర్​మాన్ తెరకెక్కిస్తున్నారు. జేమ్స్​ వాన్​, పీటర్​ సఫ్రాన్​ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మెకెన్నా గ్రేస్, మాడిసన్​ ఐస్​మన్​ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు.

కన్​జ్యూరింగ్​ యూనివర్స్ ఫ్రాంచైజీలో ఇది ఏడో చిత్రం. కన్​జ్యూరింగ్​ సిరీస్​లో మూడు, అనబెల్ సిరీస్​లో మూడు, ది నన్​ సినిమాతో కలిపి ఇప్పటివరకు మొత్తం ఏడు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. హర్రర్ చిత్రాల్లో వైవిధ్యమైన గుర్తింపు తెచ్చుకుంది కన్​జ్యూరింగ్​ సిరీస్.

ABOUT THE AUTHOR

...view details