దర్శకుడు శంకర్-హీరో రామ్‌చరణ్ కాంబోలో(Ramcharan-Shankar) ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. దాదాపుగా శంకర్ డైరెక్ట్ చేసే చాలా సినిమాలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్(AR Rahman) స్వరాలు అందిస్తారు. చెర్రీతో చేయబోయే సినిమాకు రెహ్మాన్యే సంగీతం అందిస్తారని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు శంకర్ తన మనసు మార్చుకున్నారని తెలిసింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను(Anirudh Ravichander) తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారట! వీరిద్దరి మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగిపోయాయని, త్వరలోనే అధికార ప్రకటన వస్తుందని టాక్. శంకర్ 'భారతీయుడు 2' సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కానీ కొన్ని వివాదాల వల్ల తాత్కాలికంగా ఆ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది.