తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంక్రాంతికి 'సైనికాధికారి'గా మహేశ్ బాబు​.! - మహేష్‌ 26వ సినిమా

అనిల్‌ రావిపూడి... కథా రచయితగా ఎంత హిట్టయ్యాడో దర్శకుడిగా అంతకుమించి విజయం సాధించాడు. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు తెరకెక్కిస్తే అన్నింటిలోనూ హాస్యం కలిపి వడ్డించాడు. అయితే తొలిసారి మహేశ్​బాబుని స్క్రీన్​పై చూపించే అవకాశం కొట్టేసిన ఈ యువ దర్శకుడు... ఈ సారి అద్భుతమైన సందేశాత్మక చిత్రంతో పాటు ప్రిన్స్​ను సైనికాధికారిగా పవర్​ ఫుల్​గా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.

సంక్రాంతికి 'ఆర్మీ ఆఫీసర్'గా మహేశ్​...!

By

Published : May 31, 2019, 11:42 AM IST

'పటాస్‌', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్‌' చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న అనిల్​... చివరిగా 'ఎఫ్​ 2' చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచేశాడు. అందుకే ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్​లో చేరిపోయింది. ఇదే ప్రస్థానం ప్రస్తుతం 'మహేష్‌ 26'వ సినిమా తెరకెక్కించే లక్కీ ఛాన్స్‌ అందించింది.

అనిల్​ రావిపూడి చిత్రాలు

ఎప్పుడూ చూడని మహేశ్​...

సూపర్​ స్టార్​ మహేశ్​బాబు... అమ్మాయిల మనసు దోచే రాజకుమారుడి నుంచి గ్యాంగ్​స్టర్​, పోలీసు, రాజకీయనాయకుడు, రైతు, సీఈవో, బిజినెస్​మ్యాన్​ వంటి విలక్షణ పాత్రలతో అలరించాడు. అల్లరిగా వినోదం పంచడం నుంచి పదునుగా గన్​ ఎక్కుపెట్టే వరకు అన్ని పాత్రలు చేసిన మహేశ్​... తొలిసారి సైనిక అధికారి​గా మరోసారి విభిన్న పాత్రతో అలరించనున్నాడు.

ఇటీవల మ‌హ‌ర్షి చిత్రంతో ఘన విజ‌యాన్ని అందుకున్నాడు మ‌హేష్ బాబు. అదే ఉత్సాహంలో అనిల్ రావిపూడి సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయ్యాడు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు 26వ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. 'సరిలేరు నీకెవ్వరు' అంటూ రష్మిక మందణ్నతో జత కట్టనున్నాడు. నేడు సినిమాని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. ఈ చిత్రాన్నీ భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు దిల్‌రాజు, అనిల్ సుంక‌ర.

మహేశ్ 26వ చిత్ర దర్శకుడు అనిల్​ రావిపూడి

ABOUT THE AUTHOR

...view details