తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒక్కడు 2.0: మళ్లీ అదే లొకేషన్​లో మహేశ్ - రష్మిక

కొండారెడ్డి బురుజు సెట్​లో ఉన్న మహేశ్​బాబు ఫొటోను షేర్​ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం వీరిద్దరూ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి- హీరో మహేశ్​బాబు

By

Published : Sep 23, 2019, 9:46 AM IST

Updated : Oct 1, 2019, 4:12 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్​సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్​లో​ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు ఆ ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సారి మరింత భారీగా చూపించనున్నామని ట్వీట్ చేశాడు.

దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్

"16 ఏళ్ల క్రితం.. వెండితెరపై ఈ లొకేషన్ ఓ ఐకాన్​గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు అలాంటిదే రూపొందించాం. కాకపోతే ఈసారి మరింత భారీగా చూపించబోతున్నాం. మా ప్రొడక్షన్​ డిజైనర్​ ఏఎస్ ప్రకాశ్.. కొండారెడ్డి బురుజును రామోజీ ఫిల్మ్​సిటీకి తీసుకొచ్చారు". -అనిల్ రావిపూడి, దర్శకుడు.

ఈ సినిమాలో హీరోయిన్​గా రష్మిక మందణ్న నటిస్తోంది. కీలక పాత్రలో విజయశాంతి కనిపించనుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. దిల్​రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: బాలీవుడ్​ జేజమ్మగా కరీనా కపూర్​..!

Last Updated : Oct 1, 2019, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details