తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రెట్టింపు నవ్వులకు రంగం సిద్ధమైందా..! - anil ravipudi

వెంకటేష్, వరుణ్​తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం 'ఎఫ్ 2'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు అనిల్.

anil ravipudi
వెంకటేశ్

By

Published : Dec 20, 2019, 6:57 PM IST

Updated : Dec 20, 2019, 8:09 PM IST

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది 'ఎఫ్‌ 2'. ఈ చిత్రాన్ని వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లతో దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించాడు. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అక్కడితో ఆపకుండా ఇంకా వినోదం పంచాలనుకుంటున్నాడు దర్శకుడు అనిల్‌. ఇందుకు సీక్వెల్‌గా 'ఎఫ్‌ 3'ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం.

ఈ చిత్రంలో 'ఎఫ్‌ 2' కథానాయకులు వెంకీ, వరుణ్‌తోపాటు మరో యువ కథానాయకుడు నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతేకాదు ప్రముఖ నటి విజయశాంతి కీలక పాత్ర పోషించబోతుందని వినిపిస్తుంది. మళ్లీ సంక్రాంతికే ఈ కామెడీని అందించాలనే ప్రయత్నం చేస్తున్నాడట అనిల్‌. అంటే 2021 జనవరిలో విడుదలకు ప్రణాళిక రచిస్తున్నాడని టాక్‌.

ఇవీ చూడండి.. సూపర్​స్టార్ కోసం మెగాస్టార్.. అభిమానులకు పండగే

Last Updated : Dec 20, 2019, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details