"ఉదయాన్నే కొడుకు పుట్టాడు. సాయంత్రం మెగా సూపర్ ఈవెంట్. ఇలాంటి రోజు నెవ్వరు బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్. ఈరోజును నా జీవితంలో మర్చిపోలేను" అని అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మహేశ్‌బాబు-అనిల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఆదివారం ఈ చిత్ర.. మెగా సూపర్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈరోజును జీవితంలో మర్చిపోలేను: అనిల్ రావిపూడి - tollywood news
'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చిందని, బొమ్మ దద్దరిల్లిపోద్దని అన్నాడు. ఈనెల 11న రానుందీ చిత్రం.
"మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు. చిరంజీవి పేరు వెండితెరపై ఎప్పటికీ వెలిగిపోవాలని కోరుకుంటున్నా. నాలో మొదట పుట్టిన ఆర్ట్ డ్యాన్స్‌కు చిరంజీవిగారే స్ఫూర్తి. చిన్నప్పుడు ఆయన పాటలకు డ్యాన్స్‌లు వేస్తే చాలా ప్రైజ్‌లు వచ్చాయి. ఆయన కొత్త చిత్రానికి నా శుభాకాంక్షలు. విజయశాంతిగారు నటించడం ద్వారా సంక్రాంతికి మా సినిమాలో కొత్త రంగుల ముగ్గును తెచ్చారు. ఆమె చేసిన పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోయా. భారతి పాత్రకు ప్రాణం పోశారు. పవర్ ఆఫ్ విమెన్ అనేది మరోసారి చూడబోతున్నారు. రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్ అద్భుతంగా నటించారు. రష్మిక, సంగీత చాలా సందడి చేశారు. రత్నవేల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్ ఈ సినిమాలో ఉంది. సూపర్‌స్టార్ కృష్ణగారు కనిపిస్తారు. ఆయన ఎలా కనిపిస్తారో మీరు వెండితెరపై చూడాలి. 'ఎఫ్2' విడుదల కాగానే మహేశ్‌గారికి ఈ కథ చెప్పా. ఆయన 'సినిమా చేస్తున్నాం' అని నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన దానికి నేను జనవరి 11న ఒక మంచి హిట్ ఇవ్వాలనుకుంటున్నాను. సినిమా బాగా వచ్చింది. జనవరి 11న బొమ్మ దద్దరిల్లిపోద్ది" -అనిల్ రావిపూడి, దర్శకుడు
ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.