సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తలపడనున్నాడని టాలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. మహేశ్ కథానాయకుడిగా పరశురామ్ 'సర్కారు వారి పాట' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని టాక్. దీని కోసం ఇప్పటికే కొందరు ప్రతినాయకుల్ని సంప్రదించిన చిత్రబృందం తాజాగా అనిల్ కపూర్‌ని కలిసిందని వినిపిస్తోంది.
మహేశ్ 'సర్కారు వారి పాట'లో అనిల్ కపూర్? - సర్కారు వారి పాటలో అనిల్ కపూర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం.
మహేశ్ 'సర్కారు వారి పాట'లో అనిల్ కపూర్?
అనిల్‌కు దర్శకుడు కథ చెప్పాడట. మహేశ్‌తో కలిసి నటించేందుకు అనిల్ సుముఖంగా ఉన్నాడని, కథ అతడికి బాగా నచ్చిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. ఏది ఏమైనా ఈ కాంబినేషన్ అనగానే సినీ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్, మోషన్ పోస్టర్లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి.