సీనియర్ దర్శకుడు శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనీల్కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మిస్టర్ ఇండియా'. 1987లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో అంబరీశ్ పూరి, శ్రీదేవి, సతీశ్ కౌశిక్ ముఖ్యపాత్రలు పోషించారు. బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరించారు.
మళ్లీ 31 ఏళ్ల తర్వాత శేఖర్- అనీల్ కాంబోలో మరో సినిమా రానుంది. అయితే ఈ సినిమా మిస్టర్ ఇండియాకు సీక్వెలా లేదా కొత్త సినిమా అనే విషయాన్ని వీరిద్దరూ స్పష్టం చేయలేదు. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు శేఖర్ కపూర్.