బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌కు కరోనా సోకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'జగ్ జగ్ జీయో' సినిమా షూటింగ్ కోసం ఇటీవల చండీగఢ్ చేరుకున్న చిత్రబృందం వైద్య పరీక్షలు చేసుకోగా, అందులో వరుణ్‌తో పాటు నటి నీతూ కపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది.
దీంతో ఆ ముగ్గురూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని సమాచారం. చిత్రబృందం ఇప్పటికే ముంబయి తిరుగు ప్రయాణమయ్యారు. సీనియర్ నటుడు అనిల్ కపూర్‌కు మాత్రం నెగటివ్‌గా తేలిందని ఓ నివేదిక తెలియజేసింది.