తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బింద్రా' బయోపిక్​లో హర్షవర్ధన్ కపూర్ లీడ్​రోల్​ - harshavardhan kapoor

ఒలింపిక్స్​ స్వర్ణ పతక గ్రహీత అభినవ్ బింద్రా బయోపిక్​లో బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. బింద్రా తండ్రి పాత్రను అనిల్ కపూర్​ పోషించనున్నాడు.

బింద్రా

By

Published : Jul 7, 2019, 6:35 AM IST

ప్రస్తుతం క్రీడా బయోపిక్​ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మేరీకోమ్, మిల్కా సింగ్, ధోనీ లాంటి క్రీడాకారుల జీవిత చరిత్రలను తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా ఒలింపిక్స్ స్వర్ణ పతక గ్రహీత అభినవ్ బింద్రా బయోపిక్​ రానుంది. ఇందులో బింద్రా తండ్రి పాత్రను అనిల్ కపూర్ పోషిస్తుండగా... అతని కుమారుడు అభినవ్ పాత్రలో మెప్పించనున్నాడు.

ఇటీవలే అభినవ్ బింద్రా తండ్రి అపజీత్ బింద్రాను కలిశాడు అనిల్ కపూర్. కన్నన్ అయ్యర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

"గొప్ప కథలు చెప్పడానికి అర్హత కావాలి. అభినవ్ బింద్రా విజయం వెనక ఉన్న అతడి కుటుంబ పాత్రను తెలుసుకునే అవకాశం మాకు దక్కింది. ఈ సినిమాను వెండి తెరపైకి తీసుకొచ్చేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం" - అనిల్ కపూర్, బాలీవుడ్ నటుడు.

2008 బీజింగ్ ఒలింపిక్స్​లో స్వర్ణ పతకాన్ని సాధించాడు అభినవ్ బింద్రా. 10మీటర్ల ఎయిర్​ రైఫిల్ విభాగంలో ఈ ఘనత సాధించాడు. వ్యక్తిగత విభాగంలో పసిడి కైవసం చేసుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు అభినవ్ బింద్రా.

ఇది చదవండి: సినీ డైరీ: నిర్మాత ఒప్పుకోలేదు.. 50 వారాలు ఆడింది

ABOUT THE AUTHOR

...view details