కరోనా దెబ్బకు రోజుకో వింత చూడాల్సి వస్తోంది. ఇప్పటికే పక్క వ్యక్తిని పలకరించడానికి రకరకాలుగా, వింతగా అభివాదాలు చేసుకుంటున్నాం. పక్కదేశం నుంచి ఎవరైనా వచ్చాడని తెలిస్తే అతడికి ఆమడ దూరం ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం, వైద్యులు కూడా సామాజిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. అయితే తాజాగా నాలుగు నెలల తర్వాత న్యూయార్క్ నుంచి వచ్చిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సూచనలను ఆచరణలో పెట్టాడు.
శుక్రవారం న్యూయార్క్ నుంచి వచ్చిన అనుపమ్‌ను కలిసేందుకు హీరో అనిల్‌కపూర్ వెళ్లాడు. కానీ వీరిద్దరూ ఇంట్లోకి వెళ్లకుండా బయట నుంచే వీడియోకాల్ ద్వారా పలకరించుకున్నారు.