తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కింగ్ నాగార్జున సినిమాలో జూనియర్ జయలలిత - నాగార్జున ప్రవీణ్ సత్తారు

తమిళ యువ నటి అనికా సురేంద్రన్.. కింగ్ నాగార్జునతో కలిసి నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నారు.

anikha surendran with nagarjuna in praveen sattaru film
నాగార్జున

By

Published : Feb 10, 2021, 6:29 AM IST

Updated : Feb 10, 2021, 9:14 AM IST

అగ్ర కథానాయకుడు నాగార్జున.. కొత్తతరం దర్శకులతో పనిచేయడంపై ఆసక్తి చూపుతున్నారు. యువ డైరెక్టర్​ అహిసోర్‌ సాల్మన్‌తో 'వైల్డ్‌ డాగ్‌'ను పూర్తి చేశారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఆ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం ప్రవీణ్‌ సత్తారుతోనూ ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.

'గరుడవేగ'తో విజయాన్ని అందుకున్న ప్రవీణ్‌... నాగార్జున కోసం ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథను సిద్ధం చేశారు. ఇందులోని ఓ కీలక పాత్రలో అనికా సురేంద్రన్‌ నటిస్తోంది. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన 'క్వీన్‌'లో చిన్నప్పటి జయలలితగా నటించింది ఈ టీనేజ్‌ అమ్మాయి. తర్వాత పలు తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇప్పుడు నాగ్‌తో కలిసి సందడి చేయనుంది.

నటి అనికా సురేంద్రన్
Last Updated : Feb 10, 2021, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details