తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్: 'యాంగ్రీ బర్డ్స్​ మళ్లీ వస్తోంది' - release

2016లో వచ్చిన హాలీవుడ్ సినిమా యాంగ్రీ బర్డ్స్​కు సీక్వెల్​ రాబోతుంది. యాంగ్రీబర్డ్స్​ 2 పేరుతో రానున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

యాంగ్రీ బర్డ్స్​

By

Published : Jul 29, 2019, 9:20 PM IST

యాంగ్రీ బర్డ్స్​.. ఈ గేమ్​ గురించి తెలియని వారున్నారా! అంటే అతిశయోక్తి కాదేమో అంతగా స్మార్ట్​ ఫోన్ యూజర్లకు పరిచయమైంది. ఈ గేమ్ ఆధారంగా 2016లో 'యాంగ్రీ బర్డ్స్'​ చిత్రం వచ్చి ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్​ రాబోతుంది. ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదలైంది.

ఒకప్పుడు బద్ధ శత్రువులైన పక్షులు, పందులు ఈ సీక్వెల్‌లో స్నేహితులైపోతాయి. జటా (పర్పుల్‌ బర్డ్‌)అనే మరో పక్షి.. ఇతర పక్షులు, పందుల స్థావరాలపై మంచు గడ్డలతో దాడి చేస్తాయి. దాని ఆట కట్టించాలని లియోనార్డ్‌ (పంది), రెడ్‌ (పక్షి) ఇంటికి వెళ్లి జటాను ఎలాగైనా కట్టడిచేయాలని చెప్తుంది. దీంతో వారిద్దరూ ఇతర స్నేహితులతో కలిసి జటాను ఎలా దెబ్బతీశారు? అనేది చిత్ర కథాంశం.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న ఈ సినిమా ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: టీజర్​: హిందీ 'ప్రస్థానం'లో అదరగొట్టిన సంజూ

ABOUT THE AUTHOR

...view details