ఊహాగానాలకు తెరదించుతూ ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ తన తర్వాతి చిత్రంపై స్పష్టత ఇచ్చింది. మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న 'ద ఎటర్నల్స్'లో థెనా అనే పాత్రలో నటిస్తున్నట్లు చెప్పింది. శాండియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఫెస్టివల్లో ఈ విషయం వెల్లడించింది.
"ఈ సినిమా కోసం పదింతలు ఎక్కువ కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నా. ఇది మార్వెల్ స్టూడియోస్‌కు సంబంధించిన చిత్రం. ముందున్న టాస్క్ ఏంటనేది మాకు తెలుసు. దానిని నిర్వర్తించేందుకు శతవిధాల ప్రయత్నిస్తాం." -ఏంజెలినా జోలీ, హాలీవుడ్ నటి
ఏంజెలినా జోలీ