బాలీవుడ్‌లో విజయవంతమైన 'అంధాధున్' చిత్రం.. ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా ఈ చిత్రం రూపొందుతోంది. బి.మధు సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
'అంధాధున్' తెలుగు రీమేక్ షురూ - Andhadhun remake
బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన 'అంధాధున్' సినిమాకు ప్రస్తుతం తెలుగులో రీమేక్ తెరకెక్కుతోంది. నితిన్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాాగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది.
పూజా కార్యక్రమాలతో సోమవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్‌నిచ్చాడు. నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చిన్న బాబు) చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశాడు. దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేయగా తొలి సన్నివేశానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. హీరోయిన్, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
ఇదీ చూడండి.. అతిలోక సుందరి.. ఓ మరలిరాని అద్భుతం.. చెదిరిపోని జ్ఞాపకం