ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'అంధాదున్'. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. డార్క్ కామెడి థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా చైనాలో విడుదలవనుంది.
చైనాలో 'పియానో ప్లేయర్'గా సినిమాను విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. ఆయుష్మాన్ ఇందులో గుడ్డివాడిగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. రాఘవన్ దర్శకత్వం వహించిన సినిమాలు చైనాలో విడుదలవడం ఇదే మొదటిసారి.
"నా సినిమా చైనాలో విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల క్రితం నేను చైనా వెళ్లా. అక్కడ బీజింగ్ కేఫ్ రోడ్డులో నడుచుకుంటూ వెళుతున్నపుడు బిగ్ స్క్రీన్‌పై బాలీవుడ్ సిసిమా నడుస్తుందని తెలిసింది. నాసీర్ హుస్సేన్ నటించిన 'కార్వాన్' చిత్రం అది. ఆ కాలంలో భారతీయుల ఫేవరేట్ సినిమా అని వారికి చెప్పా. ఇప్పుడు నా సినిమా విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా".
శ్రీరాం రాఘవన్, అంధాదున్ దర్శకుడు
థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన భారతీయ సినిమా చైనాలో విడుదలవడం ఇదే మొదటిసారని చిత్ర మీడియా భాగస్వామి టాంగ్ మీడియా తెలిపింది.