టాలీవుడ్ కథానాయకుడు నితిన్ 'అంధాధున్' రీమేక్‌లో హీరోయిన్ల ఎంపిక పూర్తయింది. ఎప్పటి నుంచో పలువురి భామల పేర్లు అనుకుంటున్నప్పటికీ చివరకు తమన్నా-నభా నటేష్‌లను ఖరారు చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం. మాతృకలో టబు-రాధిక ఆప్టే పోషించిన పాత్రల్లో వీరిద్దరూ కనిపించనున్నారు.
ఆ రీమేక్‌లో నితిన్‌తో తమన్నా-నభా నటేష్ - nithiin latest movie news
హీరో నితిన్ కొత్త సినిమాలో నభా నటేష్, తమన్నా కథానాయికలుగా నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
నితిన్‌తో తమన్నా-నభా నటేష్
ఓ అంధుడు, ఓ మర్డర్ మిస్టరీ మధ్య సాగే కథతో ఈ సినిమా తీయనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. బి.మధు సమర్పణలో ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.