తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చైనా నుంచి జపాన్ వెళ్తున్న అంధుడు! - andhadhun japan

ఇటీవలే చైనాలో విడుదలై మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రం 'అంధాధున్'.. జపాన్​ ప్రేక్షకులను పలకరించనుంది. నవంబరు 15న అక్కడ విడుదల కానుంది.

అంధాధున్

By

Published : Nov 13, 2019, 10:18 AM IST

గత ఏడాది బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన 'అంధాధున్'చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చైనాలోనూ విడుదలై రూ. 100 కోట్లు వసూలు చేసింది. తాజాగా జపాన్ ప్రేక్షకులను పలకరించనుంది ఈ సినిమా.

నవంబరు 15న జపాన్​లో విడుదల కానుంది. అంధుడిగా కనిపించిన ఆయుష్మాన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డూ దక్కించుకున్నాడు.

ఇందులో ఆయుష్మాన్​తో పాటు టబు, రాధికా ఆప్టే కీలక పాత్రలు పోషించారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు.

ఇదీ చదవండి: నటుడు రాజశేఖర్‌కు తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details