ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలీవుడ్ చిత్రం 'అంధాధున్'.. చైనాలో కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 13 రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమాకు శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఆయుష్మాన్ ఈ సినిమాలో పియానో ప్లేయర్‌గా కనిపించగా.. టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు.
చైనాలో 200 కోట్లు కొల్లగొట్టిన 'అంధాధున్' - ayushman
గతేడాది చిన్న సినిమాగా విడుదలైన 'అంధాధున్' చిత్రం బాలీవుడ్లో 300 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా చైనాలో 200 కోట్ల మార్కును అధిగమించింది.
అంధాదున్
చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాల్లో అంధాధున్ నాలుగో స్థానంలో ఉంది. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది చిన్న సినిమాగా విడుదలై భారత్‌లో 300 కోట్లకు పైగా వసూలు సాధించిందీ డార్క్ కామెడీ చిత్రం.