చైనాలో 100 కోట్ల క్లబ్లో 'అంధాధున్' - సీక్రెట్ సూపర్‌స్టార్
చైనాలోనూ భారతీయ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆమిర్‌ఖాన్ పీకే, సీక్రెట్ సూపర్‌స్టార్, దంగల్ చిత్రాలు చైనీయులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్ చేరింది.
బాలీవుడ్ హిట్ చిత్రం 'అంధాధున్' డ్రాగన్ వాసులనూ ఆకట్టుకుంటోంది. అక్కడ విడుదలైన వారంలోనే 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఏప్రిల్ 3న చైనా బాక్సాఫీస్ ముందుకెళ్లిన ఈ చిత్రం... ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లు రాబడుతోందట. ఓ డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించాడు. ఇతడికి జోడీగా రాధికా ఆప్టే నటించింది. సీనియర్ నాయిక టబు ఓ ముఖ్యపాత్ర పోషించింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు.