జాతీయ అవార్డు పొందిన 'అంధాధున్' సాంకేతిక విభాగాల్లో నాలుగు పురస్కారాలు గెల్చుకుంది. సోమవారం జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ తారాగణం హాజరైంది. ప్రధాన అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 18న ముంబయిలో జరగనుంది. తొలిసారి భారత్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తుడటం వల్ల ఈ వేడుకపై ఆసక్తి ఏర్పడింది.
వివిధ కేటగిరీలు - విజేతలు...
- సినిమాటోగ్రఫీ: సుధీప్ ఛటర్జీ(పద్మావత్)
- స్క్రీన్ప్లే: శ్రీరామ్ రాఘవన్, అర్జిత్ బిస్వాస్, పూజా లదా శృతి , యోగేశ్ చంద్రశేఖర్, హేమంత్ రావ్(అంధాధున్)
- డైలాగులు: అక్షత్ గిల్దియల్(బాదాయి హో)
- ఎడిటింగ్: పూజా లదా శృతి(అంధాధున్)
- కొరియోగ్రఫీ: కృతి మహేశ్, జ్యోతి తోమర్(పద్మావత్ చిత్రంలోని 'ఘూమర్' పాటకు)
- సౌండ్ డిజైన్: కృనాల్ శర్మ(తుంబాడ్)
- సౌండ్ మిక్సింగ్: అజయ్ కుమార్(అంధాధున్)
- నేపథ్య సంగీతం: డేనియల్(అంధాధున్)
- స్పెషల్ ఎఫెక్ట్స్: ఫిల్మ్గేట్ ఫిల్మ్స్(తుంబాడ్)
ఐఫా రాక్స్ వేడుకకు ప్రముఖ నటులు రాధికా ఆప్టే, అలీ ఫజల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అమిత్ త్రివేది, సలీమ్ సులేమాన్, నేహా కక్కర్, జస్సీ గిల్, ప్రాక్, ధ్వని భనుషాలి, రంజిత్, జొనిత, నకాశ్ అజీజ్, కుట్లే ఖాన్, తులసీ కుమార్ ఈ కార్యక్రమంలో తమ ప్రదర్శనలతో అలరింపజేశారు. అర్జున్ రాంపాల్, రకుల్ ప్రీత్, అపరశక్తి ప్రధానాకర్షణగా నిలిచారు.